మన హైదరాాద్ లో ముద్ర లాంటి కంపెనీ ఉంది తెలుసా...

updated: March 1, 2018 19:52 IST
మన హైదరాాద్ లో ముద్ర లాంటి కంపెనీ ఉంది తెలుసా...

కొందరికి పుట్టకతో సృజనాత్మకత అబ్బుతుంది..మరికొందరు..పట్టుబట్టి సృజనాత్మకతను ఒంటబట్టించుకుంటారు. అయితే పుట్టుకతో వచ్చిన వారి సృజనాత్మకత..వారి వయస్సుతో పాటు పెరుగుతూంటుంది..పదనుతేలుతుంది.ప్రపంచాన్ని అబ్బుర పరుస్తుంది. అటువంటి సృజనశీలి..గంగారెడ్డిగారు. ఆయన సినీ రచయిత, దర్శకుడు, సోషల్ ఎనాలసిస్ట్, కవి,ఫొటో గ్రాఫర్ ఇలా చెప్పుకుంటూ పోతే...అతిశయోక్తిగా ఉంటాయి కానీ అన్ని రంగాల్లో ఆయన సృజన వెలుగుతూనే ఉంది. అందుకు సాక్ష్యం ఆయన రాసిన స్క్రిప్టులు  ..తీసిన యాడ్ ఫిల్మ్ లు..ఆయనతో పరచయం ఉన్నవారి అనుభవాలు.   సామాజిక అంశాల్లో చురుకుగా స్పందించే ఆయన సినిమాను కూడా అందుకు సాధనంగా ఉపయోగించాలని చెప్తూంటారు. ఎందుకంటే ఎక్కువమందికి చేరేది సిని మీడియం. 

అందుకోసం రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో రెండు సంవత్సరాలు పాటు డైరక్షన్ మరియు ఎడ్వర్టైజింగ్ కోర్స్ చేసారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు ప్రముఖ తెలుగు దర్శకుడు దేవకట్టాతో జర్నీ చేసారు. అక్కడ  తను ఫిల్మ్ స్కూల్ లో చదువుకున్న పాఠాల..ప్రాక్టికల్ వెర్షన్ చూసారు. గత ఏడు సంవత్సరాలుగా యాడ్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న గంగారెడ్డి గారు..చేసిన కిసాన్ రాజా, కేర్ మొట్టో వంటి ఎన్నో సక్సెస్ ఫుల్ యాడ్ ఫిల్మ్ లు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన మాయాజూమ్ ఫిల్మ్స్ అనే సంస్దను స్దాపించారు. అలాగే ఆయన రైతు సమస్యలు మీద చేసిన షార్ట్ ఫిల్మ్ లు న్యూ జర్సీ ఫిల్మ్  పెస్టివల్ లో సెలక్ట్ అవటం , ప్రదర్శించటం జరిగింది. ఆయన రీసెంట్ గా చేసిన విజయ డైరీ యాడ్ ఫిల్మ్ ఆయనలోని ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పటంలో సందేహం లేదు. ఆ యాడ్ ఫిల్మ్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

అలాగే ఆయన చేసిన మిస్సింగ్ అనే షార్ట్ ఫిల్మ్ ని   New Jersey  film festival లో షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఎంపికైంది. మార్చి రెండున ఈ షార్ట్ ఫిలిం ప్రదర్శించబడుతోంది. ఆయన త్వరలోనే సినిమా డైరక్ట్ చేయాలని తెలుగు 100 కోరుకుటూ శుభాకాంక్షలు తెలుపుతోంది.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments